Jagan: నవరత్నాల్లో మార్పులు చేర్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం!: జ‌గ‌న్

  • 39వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌
  • ఈ రోజు అనంతపురం జిల్లాలోని మరాల గ్రామంలో ప‌ర్య‌ట‌న
  • రైతులు పంటలు వేసే సమయంలో బ్యాంకుల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది
  • అధికారంలోకి వ‌చ్చాక‌ ప్రతి రైతు కుటుంబానికి రూ.12 వేలు ఇస్తాం

ప్రజలకు మంచి చేసేందుకు త‌మ పార్టీ నవరత్నాలను ప్రకటించిందని, వాటిలో మార్పులు చేర్పులు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌జా సంకల్ప యాత్ర పేరుతో జ‌గ‌న్ చేస్తోన్న పాద‌యాత్ర 39వ రోజుకు చేరుకుంది. ఈ రోజు అనంతపురం జిల్లాలోని మరాల గ్రామంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతుల క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు.  

   రైతులు పంటలు వేసే సమయంలో పెట్టుబడుల కోసం బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడాల్సివస్తోందని జ‌గ‌న్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే 'రైతన్న భరోసా' పేరుతో ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి రూ.12 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తామ‌ని, వడ్డీ లేని రుణాలు ఇస్తామ‌ని, గిట్టుబాటు ధర క‌ల్పిస్తామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు అస‌త్యాలు చెప్పే నాయకుడు కావాలా? మోసం చేసే నాయకుడు కావాలా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడికి బుద్ధి చెప్పాల‌ని అన్నారు.
 
 

  • Loading...

More Telugu News