train: బీహార్లో రైలు ప్ర‌మాదాన్ని నివారించిన 12 ఏళ్ల బాలుడు!

  • రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతోన్న బాలుడు
  • ట్రాక్‌ విరిగిపోయింద‌ని గుర్తించి, విష‌యాన్ని గేట్‌మెన్‌కు చెప్పిన చిన్నారి  
  • రైలుని నిలిపివేసిన స్టేష‌న్ మాస్ట‌ర్‌

రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతోన్న ఓ బాలుడు ట్రాక్‌ విరిగిపోయి ఉండడాన్ని గమనించి, చివ‌ర‌కు రైలు ఆగేలా చేసి వంద‌ల మంది ప్రాణాల‌ను కాపాడిన ఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది. భీమ్ (12) అనే బాలుడు విరిగిన రైలు పట్టాను చూసిన వెంట‌నే.. పరిగెత్తుకుంటూ వెళ్లి గేట్‌మెన్‌కి ఈ విష‌యాన్ని చెప్పాడు.

దీనిపై వెంటనే స్పందించిన గేట్‌మెన్‌.. స్టేషన్‌మాస్టర్‌కు ఈ విష‌యాన్ని చెప్పి రైలును నిలిపేశారు. ఆ స‌మ‌యంలో ఆ ట్రాక్‌పై 55072 గోరఖ్‌పూర్‌-నర్కాటియగంజ్‌ లోకల్ వ‌స్తోంద‌ని, మ‌రో 15 నిమిషాల్లో అది అక్క‌డ‌కు చేరుకునేద‌ని చెప్పారు. ఆ బాలుడు ఈ విష‌యాన్ని త‌మ‌కు చెప్ప‌క‌పోతే ప్రమాదం జ‌రిగి ఉండేద‌ని అన్నారు. అంత‌మంది ప్రాణాలు కాపాడిన‌ ఆ బాలుడి చ‌దువు కోసం సాయం చేస్తామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News