adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘర్షణ వాతావరణం.. 4వేల మంది పోలీసులతో పహారా

  • లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణ 
  • ఏజెన్సీలో 144 సెక్షన్
  • వదంతులు నమ్మవద్దన్న పోలీసులు

లంబాడాలు, ఆదివాసీల మధ్య ఘర్షణతో ఆదిలాబాద్ జిల్లా అట్టుడుకుతోంది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో 4 వేల మంది పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. సమస్యాత్మకమైన గ్రామాలపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. రకరకాల వదంతులు వచ్చే అవకాశం ఉందని... ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. ఉట్నూర్ ఏజెన్సీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసింది. దీని ప్రభావం ఇతర ప్రాంతాలకు కూడా పాకి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

  • Loading...

More Telugu News