sensex: నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్.. బేర్ మన్న మార్కెట్లు

  • నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
  • అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 59 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లలో గత నాలుగు రోజులుగా కొనసాగిన ర్యాలీకి నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో, ఇవాల్టి ప్రారంభంలో వచ్చిన లాభాలను కూడా మార్కెట్లు కోల్పోయాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు పతనమై 33,777కు పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 10,444 వద్ద క్లోజ్ అయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇవాల్టి టాప్ గెయినర్స్...
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (35.24%), రామ్కో సిమెంట్స్ (14.34%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (10.67%), రిలయన్స్ క్యాపిటల్ (7.14%), రిలయన్స్ పవర్ (6.89%).

టాప్ లూజర్స్...
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-4.35%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.94%), వీడియోకాన్ ఇండస్ట్రీస్ (-3.18%), బ్లూ డార్ట్ ఎక్స్ ప్రెస్ లిమిటెడ్ (-2.95%), పేజ్ ఇండస్ట్రీస్ (-2.72%).    

  • Loading...

More Telugu News