India: శ్రీలంక ముందు 181 పరుగుల లక్ష్యం ఉంచిన టీమిండియా!
- కటక్‌లో భారత్, శ్రీలంక మొదటి టీ20
- రాణించిన లోకేశ్ రాహుల్ (61)
- మాథ్యూస్, పెరెరా, ఫెర్నాండోలకు తలో వికెట్
భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. 13 బంతులు ఎదుర్కున్న రోహిత్ శర్మ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాథ్యూస్ బౌలింగ్‌లో ఔట్ అయిన తరువాత శ్రేయాస్ అయ్యర్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రదీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
లోకేశ్ రాహుల్ 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరెరా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ 39 పరుగులు చేయగా, మనీశ్ పాండే 32 పరుగులు చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో టీమిండియాకు 7 పరుగులు వచ్చాయి. దీంతో శ్రీలంక ముందు టీమిండియా 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్, పెరెరా, ఫెర్నాండోలకు తలో వికెట్ దక్కింది.