undavalli: బీజేపీతో చంద్రబాబు విడిపోవచ్చు!: మాజీ ఎంపీ ఉండవల్లి
- వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి
- బీజేపీ గెలవకపోతే పరిస్థితి మారుతుంది
- బీజేపీకి ప్రజల మద్దతు రాకపోతే చంద్రబాబు ఆ పార్టీ నుంచి విడిపోతారు
- పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి
గుజరాత్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ, టీడీపీ కలిసే ఎన్నికలకు వెళతాయని తాను అనుకుంటున్నానని కానీ, కొన్ని పరిస్థితులు వస్తే మాత్రం విడిపోతాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... వచ్చే ఏడాది రానున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు విషయంలో ఏమైనా తేడా వస్తే చంద్రబాబు ఆ పార్టీ నుంచి విడిపోతారని చెప్పారు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టతతో ఉంటారని, తమకు అవసరం లేదని అనుకుంటే మిత్రత్వాన్ని తెంచుకుంటారని తెలిపారు.
'బీజేపీ వారు కూడా చంద్రబాబుతో కలిసి ఎన్నికల్లో వెళ్లడానికి సిద్ధంగా ఉండబోరు. అంటే.. ఎన్నటికీ మన పార్టీ బతుకు ఇంతేనా, ఇక ఏపీలో బలపడదా? అంటూ బీజేపీ నేతలు ఆలోచిస్తారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. ఈ రెండు ఎన్నికలు వేర్వేరుగా పెడితే మాత్రం ఈ పార్టీలు ఎలా ముందుకు వెళతాయో చూడాలి' అని ఉండవల్లి అన్నారు.