subrahmania swamy: 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో తీర్పుపై ఉన్న‌త న్యాయ‌స్థానానికి వెళ‌తా: సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి

  • 15 మందిని నిర్దోషులుగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
  • ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తానన్న స్వామి 
  • సర్కారు కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని సలహా 

పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు మ‌రో 15 మందిని ఈ కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో, దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, అలాగే ఈ తీర్పును సవాలు చేస్తూ స‌ర్కారు కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని అన్నారు. న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును మాజీ ఏజీ ముకుల్‌ రోహత్గి స్వాగతించడాన్ని కూడా తాను ఖండిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యంపై తాను ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీకి లేఖ రాస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News