UNO: ట్రంప్ కు షాకిచ్చిన యూఎన్... 'గుర్తు పెట్టుకుంటా'నంటూ చిన్న దేశాలకు అమెరికా వార్నింగ్!

  • ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేం అంటున్న అమెరికా
  • యూఎన్ ఓటింగ్ లో 128 దేశాలు వ్యతిరేకం
  • నిధులు ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చిన అమెరికా

ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను పరిగణిస్తున్నట్టు అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి ముక్తకంఠంతో ఖండించగా, తమకు వ్యతిరేకంగా ఓటు వేసిన చిన్న దేశాలపై అమెరికా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమెరికా, ఇజ్రాయిల్ సహా 9 దేశాలు మాత్రమే జెరూసలేం రాజధానిగా ఉండాలని కోరుకోగా, ఏకంగా 128 దేశాలు తాము వ్యతిరేకమని స్పష్టం చేశాయి. మరో 35 దేశాలు తటస్థంగా ఉండగా, 21 దేశాలు ఓటింగుకు గైర్హాజరు అయ్యాయి.

 ఇక తమ ఓటమిని ముందే ఊహించిన అమెరికా, తమ నుంచి సాయం పొందుతున్న చిన్న దేశాలపై ఆంక్షల బూచిని ప్రయోగించింది. అయినా సరే ఏ దేశమూ లొంగలేదు. ఓటింగ్ అనంతరం ఐరాసలో యూఎస్ ప్రతినిధి నిక్కీ హేలీ మాట్లాడుతూ, "ఈ రోజును అమెరికా గుర్తు పెట్టుకుంటుంది. ఓ స్వతంత్ర దేశంగా మా సార్వభౌమత్వానికి ఈ సమావేశం అడ్డు తగిలింది. దీన్ని గుర్తు పెట్టుకుంటాం. ఐరాసకు అత్యధికంగా నిధులు ఇస్తున్నది మేమేనని మరువకండి. మాకు వ్యతిరేకంగా ఓటేసిన ఎన్నో దేశాలు, తమ తమ ప్రయోజనాల కోసం అమెరికాను వాడుకున్నవే" అని అన్నారు. వ్యతిరేక దేశాలకు ఇస్తున్న నిధులను, రాయితీలను పునఃపరిశీలిస్తామని ఆమె అన్నారు. ఏదిఏమైనా ఇజ్రాయిల్ లోని తమ ఎంబసీని జెరూసలేంకు మార్చేది ఖాయమని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News