Pakistan: ఇండియా జోలికి పోవద్దు: పాకిస్థాన్ కు అమెరికా వార్నింగ్

  • ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో తొలి స్థానంలో పాక్
  • ఉగ్రవాదుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే
  • ఆర్థిక తాయిలాలు కూడా ఆపేస్తాం

ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్థాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ ను ట్రంప్ తొలి స్థానంలో చేర్చారని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. త్వరలోనే ఆయన ఆఫ్ఘనిస్థాన్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం నుంచి పాకిస్థాన్ తాలిబన్లతో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని... ఇకపై ఇలాంటివి జరగడానికి వీల్లేదని... అందుకే పాక్ ను ట్రంప్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల జాబితాలో చేర్చారని చెప్పారు.

అమెరికాతో ఉన్న భాగస్వామ్యం వల్ల పాకిస్థాన్ భారీ ఎత్తున లబ్ధి పొందుతోందని... ఇకపై ఇలాంటివి పాక్ కోల్పోనుందని పెన్స్ తెలిపారు. ఇండియా, ఆప్ఘనిస్థాన్ దేశాలపై తమ దేశంలోని అరాచక శక్తులను ఉపయోగించుకుంటున్న పాక్ ను గట్టిగా హెచ్చరిస్తున్నామని... ఇకపై ఇలాంటివన్నీ ఆపేయాలని అన్నారు. ఉగ్రవాదుల విషయంలో పాక్ కఠినంగా వ్యవహరించాల్సిందేనని చెప్పారు.

  • Loading...

More Telugu News