sensex: క్రిస్మస్ కు ముందు రికార్డుల మోత మోగించిన మార్కెట్లు
- తొలిసారి 10,500 మార్క్ టచ్ చేసిన నిఫ్టీ
- 34వేలకు సమీపంలో సెన్సెక్స్
- దూసుకుపోయిన ఐటీ, ఆటో స్టాక్స్
భారతీయ స్టాక్ మార్కెట్లకు క్రిస్మస్ పండుగ ముందుగానే వచ్చింది. ఈ రోజు మార్కెట్లు రికార్డుల మోత మోగించాయి. ఐటీ, ఆటో స్టాక్స్ లో భారీ ఎత్తున కొనగోళ్లు జరగడంతో మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. ఈ క్రమంలో, ఈనాటి ట్రేడింగ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు నిఫ్టీ తొలిసారి 10,500 మార్క్ ను టచ్ చేసింది. మరోవైపు ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 33,940.30ను టచ్ చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 184 పాయింట్లు పెరిగి 33,940కి ఎగబాకింది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 10,493 వద్ద ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇవాల్టి టాప్ గెయినర్స్...
నెట్ వర్క్ 18 (10.55%), ఈక్లర్క్స్ సర్వీసెస్ (9.85%), రిలయన్స్ నేవల్ (8.96%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (8.11%), గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (7.40%).
టాప్ లూజర్స్...
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-9.24%), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (-5.22%), యూనిటెక్ లిమిటెడ్ (-3.79%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (-2.66%), కాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ (-2.65%).