raghu: సినిమాల్లోకి రాకముందు 'సెటిల్మెంట్లు' చేసిన మాట వాస్తవమే!: కామెడీ విలన్ రఘు
- పుట్టి పెరిగింది హైదరాబాద్
- చిన్న చిన్న బస్తీ గొడవలు మామూలే
- స్టూడెంట్ గా వున్నప్పుడే ఓ జోన్ లోకి పోయాను
- ఏ గొడవను ఇంటివరకూ రానిచ్చేవాడిని కాదు
తెలుగు తెరపై హీరోను దెబ్బతీయడానికి విలన్ గ్యాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ గ్యాంగ్ లో కాస్త రౌడీ ఫేస్ తో కామెడీగా కనిపించే వాళ్లు వుంటారు. అలా రౌడీ గ్యాంగ్ లో కనిపిస్తూ .. తెలంగాణ యాసతో తనదైన డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు రఘు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
"గతంలో కొంతమంది రౌడీయిజం నేపథ్యం నుంచి వచ్చి కమెడియన్స్ గా .. విలన్స్ గా సక్సెస్ అయిన వాళ్లు వున్నారు. అలాంటి నేపథ్యమే రఘుకి ఉందనే సంగతి తెలుసు. నటుడు కావడం కంటే ముందు జీవితం ఏంటి అసలు?" అనే ప్రశ్న రఘుకి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " పుట్టి పెరిగింది హైదరాబాద్ .. అల్వాల్. కాలేజ్ చదువు హైదరాబాద్ అంటే ఎట్లుంటది .. ఎలక్షన్లు .. పాలిటిక్స్ .. చిన్న చిన్న బస్తీ గడబిడలు ఇవన్నీ కామనే" అన్నారు.
"కాలేజ్ స్టూడెంట్ గా ఉండగా బ్యాచ్ లు మెయింటెయిన్ చేస్తూనే .. అట్లా .. అట్లా ఒక జోన్ లోకి పోయిన. కొన్ని బ్యాంకులకు మొండి బాకీలు వసూలు చేసి పెట్టేవాడిని. ఇంట్లో బుద్ధుడిలెక్క ఉండేవాడిని .. బయటికి వస్తే నా చుట్టూ ఓ పదిమంది ఉండేటోళ్లు. ఆ గొడవలు .. ఈ గొడవలు .. సెటిల్మెంట్లు చేసేవాడిని గానీ .. ఏవీ ఇంటివరకూ రానిచ్చేవాడిని కాదు" అని చెప్పుకొచ్చారు.