sekhar master: ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అనుకున్న సమయంలో బన్నీ నుంచి ఫోన్ వచ్చింది: శేఖర్ మాస్టర్
- డాన్స్ పట్ల ఇష్టంతోనే హైదరాబాద్ వచ్చాను
- రాకేశ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాను
- బన్నీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది
- ఆయన అలా మెచ్చుకున్నారు
ఒక వైపున కొరియోగ్రాఫర్ గా తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే .. మరో వైపున డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "విజయవాడలో ఉండగానే డాన్స్ పట్ల ఆసక్తి ఏర్పడింది. నేను కూడా సినిమాల్లో ఒక డాన్సర్ గా వుంటే బాగుంటుందే అనిపించింది. దాంతో హైదరాబాద్ వచ్చి బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ లో చేస్తూ .. రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఆ తరువాత కొరియోగ్రాఫర్ ను అయ్యాను"అన్నారు
"ఫస్టు నాకు పేరు వచ్చిన సాంగ్ .. 'ఎస్. ఎమ్. ఎస్. చిత్రంలోనిది. ఈ సినిమాలోని సాంగ్ చూసే బన్నీ .. ఎన్టీఆర్ అవకాశాలు ఇచ్చారు. సినిమాలు చేస్తున్నాను .. పైకి రావడం లేదు .. ఇంక వెళ్లిపోదాం ఊరు అనుకుంటున్నాను. ఆ సమయంలో బన్నీ ఫోన్ చేశారు .. ఈ సాంగ్ బాగా చేస్తే నిలబడతావ్ .. లేదంటే ఊరెళ్లిపోతావ్ అని మనసులో అనుకున్నాను. ' డాన్స్ పట్ల నీ అంకిత భావం చూస్తుంటే .. అమ్మాయి అయితే పెళ్లి చేసుకునేవాడిని' అని బన్నీ అన్నారంటూ నవ్వేశారు.