Gali Janardan Reddy: దేవుడికి కిరీటం ఇచ్చాను... కాపాడలేదు... వైఎస్ పోయారు, కష్టాలు వచ్చాయి: గాలి కీలక వ్యాఖ్యలు

  • సంపాదించిన డబ్బుతోనే వెంకన్నకు కిరీటం
  • గనుల వ్యాపారంలో రూ. 2 వేల కోట్లు పన్ను కట్టాను
  • హెలికాప్టర్ కొన్నది సమయాన్ని ఆదా చేసుకోవడానికే
  • తన విధిరాత బాగోలేదన్న గాలి

తాను నిజాయతీగా సంపాదించిన డబ్బుతోనే తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి రూ. 40 కోట్లతో బంగారు కిరీటాన్ని చేయించానని కర్ణాటక మాజీ మంత్రి, గనుల అక్రమ తవ్వకం నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గనుల వ్యాపారంలో రూ. 2 వేల కోట్లను ఆదాయపు పన్నుగా చెల్లించి ఉంటానని, దాని ప్రకారం తానెంత ఆస్తి సంపాదించి ఉంటానో ఊహించాలని చెప్పిన ఆయన, సమయాన్ని ఆదా చేసుకోవడం కోసమే హెలికాప్టర్ ను కొన్నాను తప్ప, హంగులు, ఆర్భాటాల కోసం కాదని చెప్పారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కష్టకాలంలో వెంకన్న తనను కాపాడలేకపోయారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత తనకు కష్టకాలం ఎదురైందని అన్నారు.

 ఇప్పుడు తాను ఎవరినీ నిందించడం లేదని అది విధిరాతని, దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. ఒకప్పుడు తనకు తొందరపాటు తనం ఉండేదని, ఇప్పుడు పరిణతి చెందానని అన్నారు. ప్రతి విషయంలోనూ సహనంతో ఉండి ఎదుర్కోవాలే తప్ప ఆవేశంతో ఎదురు తిరిగితే నష్టపోతామని కూడా అర్థమైందని చెప్పారు. తనకు వచ్చిన సంపద మరికొంత కాలం తరువాత వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. భయపడుతూ బతకాల్సిన అవసరం తనకు లేదని, బళ్లారిలో తాను చేసే సామూహిక వివాహాలే వైభవంగా జరుగుతాయని, తన కుమార్తె పెళ్లిని ఆ మాత్రం ఘనంగా చేయకుంటే తృప్తి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News