okchi: ఓఖీ తుపాను మృతులకు సముద్రం అడుగున ప్రత్యేక ప్రార్థనలు
- క్రిస్మస్ సందర్భంగా వినూత్న నివాళి
- ప్రార్థనలు నిర్వహించిన జాలర్లు, డైవర్లు
- తుపాను కారణంగా చనిపోయిన 75 మంది జాలర్లు
క్రిస్మస్ పండగ సందర్భంగా ఓఖీ తుపాను మృతులకు సముద్రం అడుగున ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళి అర్పించారు. కేరళకు చెందిన బాండ్ ఓషిన్ సఫారీ, ఫ్రెండ్స్ ఆఫ్ మెరైన్ లైఫ్ స్వచ్ఛంద సంస్థలు కలిసి దీనిని నిర్వహించాయి. 8 మంది జాలర్లు, నలుగురు డైవర్లు కలిసి తీరానికి 200 మీటర్ల దూరంలో, 8 మీటర్ల అడుగున ఈ ప్రార్థనలు నిర్వహించారు.
దాదాపు అరగంట పాటు నీటి అడుగున ఉండి, ప్రత్యేక ప్రార్థనల ద్వారా చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ తుపాను సృష్టించిన అలజడి కారణంగా 75 మందికి పైగా జాలర్లు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే వారి మృతి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని, అసలు ఓఖీ తుపానును ఎవరూ విపత్తుగా పరిగణించడం లేదని కేరళ సొసైటీ సభ్యుడు జాక్సన్ పీటర్ తెలిపారు.