black berry: బ్లాక్ బెర్రీ, విండోస్ పాత ఓఎస్ ఫోన్లకు వాట్సాప్ సేవలు బంద్
- వాట్సాప్ అభివృద్ధికి అంతరాయం కలిగించడమే కారణం
- వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని మనవి
- డిసెంబర్ 31 నుంచి అమలు
బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దానికి ముందు వెర్షన్లలో తమ సేవలను డిసెంబర్ 31, 2017 నుంచి నిలిపివేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫోన్లను ఉపయోగించేవారు కొత్త ఖాతాలను సృష్టించుకోవడం కానీ, పాత ఖాతాలను వెరిఫై చేసుకోవడం గానీ వీలు కాదని వాట్సాప్ పేర్కొంది. భవిష్యత్తులో వాట్సాప్ అభివృద్ధి చేయాలనుకుంటున్న కొత్త ఫీచర్లకు ఈ ఆపరేటింగ్ సిస్టంలు అంతరాయం కలిగిస్తున్నాయని, అందుకే సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.
అలాగే డిసెంబర్ 31, 2018 నుంచి నోకియా ఎస్40 ఫోన్లలో, ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7, దానికి ముందు ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయబోవని తెలిపింది. ఆయా ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్న వారందరూ అప్‌డేట్ చేసుకోవడం ద్వారాగానీ, వేరే ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించడం ద్వారా గానీ సేవలను పునరుద్ధరించుకోవాలని కోరింది.