Rakhi Sawant: వాటి తొలి కస్టమర్లు కోహ్లీ-అనుష్క అయితేనే బాగుంటుందట.. రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు!
- ‘బీబోయ్’ కండోమ్‌ల తొలి వినియోగదారులు కోహ్లీ జంట కావాలన్న రాఖీ
- పతంజలి కండోములు తయారుచేయాలంటూ రాందేవ్ బాబాకు సవాలు
- వివాదాస్పదమవుతున్న రాఖీ సావంత్ వ్యాఖ్యలు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్ నూతన జంట కోహ్లీ-అనుష్కలకు వివాదాస్పద సలహా ఇచ్చింది. ‘బీబోయ్’ అనే కండోమ్ బ్రాండ్‌కు రాఖీ సావంత్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆమె నటించిన ఈ కండోమ్ ప్రకటనలపై ఇటీవల వివాదం చెలరేగింది. వీటిని ఉదయం ప్రసారం చేయవద్దని, రాత్రి పది తర్వాతే ప్రసారం చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కండోమ్ ప్రకటనలు అసభ్యంగా ఉంటుండడంతో వీటి ప్రకటనలు నిలిపివేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కోర్టు కండోమ్ ప్రకటనల ప్రసారంపై ఆంక్షలు విధించింది. తాజాగా అసభ్యంగా లేని ప్రకటనలను పగటిపూట కూడా వేసుకోవచ్చని సూచించింది.
తాజాగా ‘బీబోయ్’ కండోమ్ బ్రాండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్ మాట్లాడుతూ.. స్వదేశీ బ్రాండ్‌తో వస్తున్న రాందేవ్ బాబాకు దమ్ముంటే పతంజలి బ్రాండ్ కండోమ్‌లు తయారుచేసి చూపించాలని సవాలు విసిరిసింది. ప్రజలు పతంజలి కండోమ్ లను చూడాలనుకుంటున్నారని పేర్కొంది. కాగా, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘బీబోయ్’ కండోములకు క్రికెటర్ కోహ్లీ-అనుష్క జంట తొలి వినియోగదారులు అయితే బాగుంటుందన్న రాఖీ.. అవి వాడి ఎలా ఉన్నాయో చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.