sai dharam tej: చైతూ చేయవలసిన సినిమానే తేజు చేస్తున్నాడట!
- చైతూ కోసం కథ రెడీ చేసుకున్న శ్రీనివాస రెడ్డి
- చివరి నిమిషంలో నిర్మాత వెనకడుగు
- ఆ కథతో తేజును ఒప్పించిన వినాయక్
గతంలో నాగార్జునతో దర్శకుడు శ్రీనివాసరెడ్డి 'ఢమరుకం' సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో నాగచైతన్యతో సినిమా చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. ఆకుల శివ మంచి కథను సిద్ధం చేశాడు కూడా. అయితే చివరి నిమిషంలో ఆ నిర్మాత వెనకడుగు వేయడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఆకుల శివ ఈ కథను వినాయక్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ కథను సాయిధరమ్ తేజ్ తో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, వినాయక్ ఆయనకి వినిపించాడట. సాయిధరమ్ తేజ్ కి అది బాగా నచ్చడంతో, వెంటనే అంగీకరించాడని అంటున్నారు. అలా చైతూ చేయవలసిన సినిమా తేజూకి వెళ్లింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి, త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు.