current bill: ఇక్కడే కాదు... అమెరికాలో కూడా కరెంటు బిల్లులు షాకిస్తున్నాయ్!

  • అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘటన
  • 284 బిలియన్‌ డాలర్ల కరెంటు బిల్లు
  • క్రిస్‌మ‌స్ పండుగకు విద్యుత్‌ దీపాలంకరణ
  • అధికారులు చేసిన తప్పిదం కారణంగా అంత బిల్లు వ‌చ్చింద‌ని నిర్ధార‌ణ‌

క్రిస్‌మ‌స్ సంద‌ర్భంగా ఇల్లు మొత్తం విద్యుత్ దీపాలంక‌ర‌ణ చేసిన ఓ మ‌హిళ‌కు  284 బిలియన్‌ డాలర్ల బిల్లు వ‌చ్చిన ఘ‌ట‌న అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. అంతేకాదు, మొదట విడతలో భాగంగా రూ.28,176 డాలర్లు చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. క‌రెంటు బిల్లును చూసి షాక్‌కు గురైన ఆ మ‌హిళ... అధికారులకు ఫిర్యాదు చేసింది.

 క్రిస్‌మ‌స్‌ పండుగ సందర్భంగా ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ పెట్టి విద్యుత్‌ దీపాలంకరణ చేశాన‌ని, ఆ మాత్రం దానికే మ‌రీ ఇంత‌గా విద్యుత్‌ బిల్లు రావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది. దీంతో అధికారులు చేసిన తప్పిదం కారణంగానే 284 బిలియన్‌ డాలర్ల బిల్లు వ‌చ్చింద‌ని, నిజానికి ఆమె క‌రెంటు బిల్లు 284.46 డాలర్లు మాత్రమేన‌ని తెలిసింది. త‌ప్పును తెలుసుకున్న అధికారులు ఆ విద్యుత్ బిల్లును స‌రిచేస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News