aadhaar: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్లు.. 71.24 కోట్లు
- లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లు 82 కోట్లు
- వెల్లడించిన కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్
- మార్చి 31, 2018 వరకు రీ-వెరిఫికేషన్
దేశవ్యాప్తంగా దాదాపు 71.24 కోట్ల మొబైల్ నంబర్లు ఆధార్‌తో అనుసంధానమైనట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. అలాగే 82 కోట్ల బ్యాంక్ ఖాతాలు కూడా ఆధార్‌తో లింక్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ వివరాలు డిసెంబర్ 8, 2017 నాటి వరకు అంచనా వేసినవి. కొత్త మొబైల్ నంబర్లకు ఆధార్ రీ-వెరిఫికేషన్‌ను మార్చి 31, 2018 లోగా చేపట్టనున్నట్లు ఆయన రాజ్యసభకు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ 2005 చట్టం ప్రకారం వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్‌కి 12 అంకెల ఆధార్ నెంబర్‌ను జోడించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.