mumbai: 31వ తేదీ అర్ధరాత్రి ముంబైలో ప్రత్యేక లోకల్ ట్రైన్స్ నడుస్తాయి!
- అర్ధరాత్రి వేడుకలు ముగించుకుని ఇంటికి వెళ్లే వారి కోసం ఈ ట్రైన్స్
- ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం
- ప్రత్యేక లోకల్ ట్రైన్స్ నడపనున్న పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే
డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి వేడుకలు చేసుకునేందుకు గేట్ వే ఆఫ్ఇండియా, మెరైన్ డ్రైవ్, చర్చి రోడ్, చౌపాటి, సీఎస్ ఎంటీ తదితర ప్రాంతాలకు ముంబై వాసులతో పాటు శివారు ప్రాంతాల వారు సాధారణంగా వెళుతుంటారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి..పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తారు.
అనంతరం తిరిగి తమ ఇళ్లకు చేరాలనుకునే శివారు ప్రాంతాల వాసులకు ఆ సమయంలో లోకల్ ట్రైన్స్ ఉండవు. దీంతో, రైల్వే ఫ్లాట్ ఫారం పైనే కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వే అధికారులు ఈసారి ప్రత్యేక లోకల్ ట్రైన్స్ నడపాలని నిర్ణయించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే లు వరుసగా ఎనిమిది, నాలుగు ప్రత్యేక లోకల్ ట్రైన్స్ ను నడపాలని నిర్ణయించుకున్నాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి తిరిగే ప్రత్యేక లోకల్ ట్రైన్స్ వివరాలు...
విరార్ నుంచి చర్చిగేట్ కు : అర్ధరాత్రి 12.15, 12,45,1.40,3.05 గంటలకు
చర్చిగేట్ నుంచి విరార్ వైపు : 1.45, 2.00, 2.30, 3.25 గంటలకు
సెంట్రల్ రైల్వే మార్గంలో సీఎస్ఎంటీ నుంచి : 1.30 గంటలకు
హార్బర్ మార్గంలో సీఎస్ఎంటీ నుండి 1.30 గంటలకు, పన్వేల్ నుండి 1.30 గంటలకు ప్రత్యేక లోకల్ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నాయి