Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రూటు మార్చిన కాజల్ అగర్వాల్ 
  • సెల్ మోగితే క్లాస్ పీకే శ్రుతి హాసన్!
  • జర్నలిస్టు పాత్రలో అక్కినేని హీరో 
  • రిపబ్లిక్ డేకి 'ఆచారి అమెరికా యాత్ర'  

*  కొత్త ఆమ్మాయిల తాకిడితో కాజల్ అగర్వాల్ కి కూడా అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో చేస్తున్న 'పారిస్ పారిస్' చిత్రం తప్ప అమ్మడి చేతిలో మరో సినిమా ఏదీ లేదు. దీంతో తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ ముద్దుగుమ్మ తాజాగా హాట్ హాట్ గా పోజులిస్తూ ఫొటో సెషన్ చేసి వదిలింది. మరి ఆ ఫొటోలు ఆమెకు ఏమాత్రం అవకాశాలు తెస్తాయో చూడాలి!
*  'షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరిదైనా సెల్ ఫోన్ మోగిందంటే నాకు భలే కోపం వచ్చేస్తుంది' అంటోంది అందాలతార శ్రుతి హాసన్. "చాలా మంది ఆర్టిస్టుల కాంబినేషన్లో షూటింగ్ చేస్తుంటే, ఒక్కోసారి ఎవరిదో సెల్ మోగుతుంది. ఇక అప్పుడు నాకు చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్లను పిలిచి చిన్న క్లాస్ పీకుతాను. ఎందుకంటే, ఆ ఫోన్ సౌండుకి మా కాన్ సంట్రేషన్ పోతుంది కదా? అందుకే, సెట్లోకి నేను ఫోన్ కూడా తీసుకెళ్లను" అని చెప్పింది.
*  'మళ్లీ రావా' సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ తాజాగా అనిల్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం విశాఖ షెడ్యూలు షూటింగ్ పూర్తి చేసుకుని, యూనిట్ హైదరాబాదుకి షిఫ్ట్ అయింది. ఇందులో సుమంత్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు.
*  విష్ణు మంచు హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నాడు.

  • Loading...

More Telugu News