mahesh bhagavath: అతివేగం, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం: రాచకొండ సీపీ మహేశ్ భగవత్
- న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రాచకొండ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఈ నెల 31 రాత్రి 11 నుంచి జనవరి 1 ఉదయం 5 వరకు అమలు
- రాచకొండ పరిధిలోని ఓఆర్ఆర్ రహదారులు మూసివేత
- విమానాశ్రయం వెళ్లే వాహనాలకు మినహాయింపు
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రహదారులపై అతివేగం, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాచకొండ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు.
ఈ నెల 31న రాత్రి 11 నుంచి జనవరి 1న ఉదయం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఆ సమయంలో తారామతి పేట, ఘట్కేసర్, కీసర, పెద్ద అంబర్పేట, బొంగులూరు, తుక్కుగూడ వద్ద ఓఆర్ఆర్ ప్రవేశ ద్వారం మూసివేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయం వెళ్లే వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులు నిబంధనలను పాటించాలని సూచించారు.