Balistic Missile: గాల్లోనే డైరెక్ట్ హిట్... మన క్షిపణుల సత్తా చాటుతూ, నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో!
- ఇంటర్ సెప్టార్ మిసైల్ పరీక్ష
- బంగాళాఖాతంపై 15 కి.మీ ఎత్తులో వస్తున్న క్షిపణి
- ఉపరితలంపై నుంచి మరో క్షిపణి ప్రయోగం
ఏదైనా ఇరుగు పొరుగు దేశంతో ఇండియా యుద్ధం చేయాల్సి వస్తే, మహా నగరాలే లక్ష్యంగా శత్రు దేశాలు ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తే... అటువంటిది జరిగితే ఎలా ఎదుర్కోవాలి? ఇదిగో ఇలా... అంటూ భారత ఇంటర్ సెప్టార్ మిసైల్ ను దూసుకొస్తున్న ఓ క్షిపణిపై ప్రయోగించి, దాన్ని గాల్లేనే తుత్తునియలు చేసి చూపించారు భారత రక్షణ అధికారులు.
బంగాళాఖాతం మీదుగా 15 కిలోమీటర్ల ఎత్తులో భారత్ వైపు దూసుకొస్తున్న మిసైల్ ను కింద నుంచి క్షిపణి నిరోధక మిసైల్ ను ప్రయోగించి నాశనం చేశారు. దూసుకెళ్లిన ఈ మిసైల్, గాల్లో శరవేగంగా ప్రయాణిస్తున్న క్షిపణిని డైరెక్ట్ హిట్ కొట్టింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మరింత అత్యాధునికీకరించే దిశగా, శత్రు దేశాల క్షిపణులను గాల్లోనే పేల్చేసే సామర్థ్యాన్ని మరింతగా పెంచుకున్నామని ఈ సందర్భంగా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.