mutual funds: 2017లో భారీ లాభాలను ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్
- ఏడాదిలో 80 శాతం వరకు రాబడి
- ఎస్ బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ టాప్
- టాప్ 10 ఫండ్స్ రాబడులన్నీ 50 శాతంపైనే
దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ ర్యాలీ చేస్తున్నాయి. దీని పుణ్యమా అని ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి మెరుగైన లాభాలు వస్తున్నాయి. ఎంపిక చేసిన మంచి పనితీరు గల ఫండ్స్ లో రాబడి గణనీయంగానే ఉంది. 2017లో ఎక్కువ శాతం రాబడులను ఇచ్చిన టాప్ 10 ఫండ్స్ ను పరిశీలిస్తే...
ఎస్ బీఐ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఏడాది కాలంలో 80 శాతం పెరిగింది. టాటా ఇండియ కన్జ్యూమర్ ఫండ్ 75 శాతం, ఎల్ అండ్ ఇండియా ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ 65 శాతం, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ 62 శాతం, ఐడీఎఫ్ సీ స్టెర్లింగ్ ఈక్విటీ ఫండ్ 61 శాతం, ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 60 శాతం, రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్ ఫండ్ 59 శాతం, ఎస్ బీఐ ఎఫ్ఎంసీజీ ఫండ్ 59 శాతం, హెచ్ఎస్ బీసీ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్ 59 శాతం, హెచ్ డీఎఫ్ సీ స్మాల్ క్యాప్ ఫండ్ 58 శాతం చొప్పున గడిచిన ఏడాది కాలంలో వృద్ధి చెందాయి.