new year: ‘న్యూ ఇయర్’ను ఆ ఆరుగురు పదహారు సార్లు జరుపుకుంటారు!
- ఐఎస్ఎస్ లోని ఆరుగురు వ్యోమగాములకు మాత్రమే ఆ ఛాన్స్
- ఒక రోజులో 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను వీక్షిస్తారు
- ఆ లెక్కన ‘న్యూ ఇయర్’ ను పదహారు సార్లు జరుపుకుంటారు
ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ దేశ కాలమానం ప్రకారం గంటల వ్యవధి తేడాతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని ఆరుగురు వ్యోమగాములు మాత్రం ఈ న్యూఇయర్ ను పదహారు సార్లు సెలబ్రేట్ చేసుకుంటారు.
అదెలా సాధ్యమంటే.. ఐఎస్ఎస్ మన భూమిని చుట్టి వచ్చేందుకు పట్టే సమయం కేవలం 90 నిమిషాలు. అంటే, ఒక రోజులో 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను వారు వీక్షిస్తారు. ఈ లెక్కన చూస్తే కొత్త సంవత్సరాన్ని కూడా 16 సార్లు చూసే అవకాశం ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. కాగా, ఐఎస్ఎస్ లోని ఆరుగురు వ్యోమగాములలో అమెరికాకు చెందిన వారు ముగ్గురు కాగా, మరో ఇద్దరు రష్యాకు, ఒకరు జపాన్ కు చెందిన వారు ఉన్నారు.