devineni uma maheswar rao: వైయస్ చనిపోయిన రోజే జగన్ పోలవరం టెండర్ల కోసం ప్రయత్నించారు: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

  • పోలవరం కాంట్రాక్ట్ కోసం జగన్ యత్నించారు
  • కాంగ్రెస్ పెద్దలతో బేరం కుదరలేదు
  • ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజే పోలవరం ప్రాజెక్టు టెండర్ల కోసం ఆయన కుమారుడు జగన్ ప్రయత్నించారంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కాంగ్రెస్ పెద్దలతో బేరం కుదరకపోవడంతో... ఆ టెండర్లను జగన్ దక్కించుకోలేకపోయారని అన్నారు. జగన్, విజయసాయి రెడ్డిలు పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, పనులు ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

ప్రాజెక్టులపై విమర్శించే నైతికత జగన్ కు లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 12,800 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గ్రావిటీ ద్వారా పోలవరం నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని తెలిపారు. 2018 నాటికి 17 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తామని చెప్పారు. జనవరి రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు.




  • Loading...

More Telugu News