good news: రుణాలు తీసుకున్న కస్టమర్లకు ఎస్‌బీఐ శుభవార్త!

  • బేస్‌ రేటును 0.3 శాతం తగ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ప్ర‌స్తుతం బేస్‌ రేటు 8.65 శాతానికి త‌గ్గుద‌ల‌
  • ఇతర బ్యాంకులతో పోలిస్తే ప్ర‌స్తుతం ఎస్‌బీఐ బేస్‌ రేటు అతితక్కువ

విద్యా రుణాలు, గృహ రుణాలు తీసుకున్న పాత‌ కస్టమర్లకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. బేస్‌ రేటు ప్రకారం లోన్లు పొందిన పాత కస్టమర్లకు బేస్‌ రేటును 0.3 శాతం తగ్గిస్తున్న‌ట్లు కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణ‌యంతో బేస్‌ రేటు 8.65 శాతానికి త‌గ్గింది. దీంతో ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ బేస్‌ రేటు అతితక్కువగా ఉంది. అయితే, మిగ‌తా బ్యాంకులు కూడా బేస్‌రేటును త‌గ్గించే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఎస్‌బీఐ ప్ర‌క‌ట‌న‌తో రుణాలు తీసుకున్న కస్టమర్లకు ప్రయోజనం చేకూర‌నుంది.    

  • Loading...

More Telugu News