ali: హీరోయిన్ గా నా కెరియర్ అలా మొదలైంది: కేథరిన్

  • అందాల కథానాయికగా కేథరిన్ కి క్రేజ్ 
  • కన్నడలో ఫస్టు సినిమా చేశాను 
  • ఆ వెంటనే మలయాళంలో చేశాను 
  • తెలుగులో నీలకంఠగారు ఛాన్స్ ఇచ్చారు

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కేథరిన్ ఒకరు. తెలుగులో 'ఇద్దరమ్మాయిలతో' .. 'సరైనోడు'.. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లోనూ ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తాజాగా ఆమె 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని, తన కెరియర్ కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది.

 " దుబాయ్ లో పుట్టి పెరిగిన నేను బెంగుళూర్ లో డిగ్రీ చేశాను. అక్కడ చదువుతున్నప్పుడు ఓ కన్నడ సినిమాలో ఛాన్స్ వచ్చింది. సరదాగా చేసి చూద్దామని అంగీకరించాను. 'శంకర్ ఐపీఎస్' అనే ఆ సినిమాలో దునియా విజయ్ హీరో. ఆ సినిమా చేసిన తరువాత, మలయాళ మూవీలో అవకాశం వచ్చింది. దాంతో తెలుగు .. తమిళ సినిమాల్లోను చేయాలనుకున్నాను. అప్పుడు దర్శకుడు నీలకంఠ గారు 'ఛమ్మక్ చల్లో' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ వెంటనే 'పైసా'లో కృష్ణవంశీ గారు అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News