Jammu and Kashmir: జవాన్లు పోరాడుతుంటారు, చస్తుంటారు..అందులో కొత్తేముంది?: బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
- ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే
- ఈ వ్యాఖ్యలపై తలెత్తిన విమర్శలు
- నా వ్యాఖ్యలు బాధిస్తే క్షమాపణలు: ఎంపీ నేపాల్ సింగ్
దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు మృతి చెందిన ఘటనపై బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘శత్రువులతో సరిహద్దుల్లో జవాన్లు పోరాడుతుంటారు, చస్తుంటారు..అందులో కొత్తేముంది. ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలూ విమర్శలు గుప్పించడంతో ఆయన మాట మార్చారు. జవాన్లను, అమరవీరులను తానేమీ అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యలు అలా అనిపిస్తే క్షమాపణలు చెబుతున్నానని యూపీలోని రాంపూర్ నియోజకవర్గ ఎంపీ అయిన నేపాల్ సింగ్ అన్నారు.