stcoks: ఈ బిగ్ ఇన్వెస్టర్ కు ఐదు కంపెనీల్లో రూ.9,000 కోట్ల పెట్టుబడులు
- జాబితాలో టైటాన్, ఎస్కార్ట్స్, డీహెచ్ఎఫ్ఎల్, క్రిసిల్, లుపిన్
- ఒక్క టైటాన్ కంపెనీలో వాటాల విలువే రూ.9,150 కోట్లు
- రాకేశ్, ఆయన సతీమణి రేఖకు లాభాల వెల్లువ
దేశంలోని బడా ఇన్వెస్టర్లలో రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఒకరు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పరిచయం ఉన్న పేరు ఇది. రాకేశ్ కు ఎన్నో కంపెనీల్లో పెట్టుబడులు ఉండగా, వాటిలో ఐదు కంపెనీల్లో ఉన్న పెట్టుబడుల విలువే ఏకంగా రూ.9,150 కోట్లకు చేరింది. ఆ కంపెనీలు ఏవంటే... టైటాన్ కంపెనీ, ఎస్సార్ట్స్, డీహెచ్ఎఫ్ఎల్, క్రిసిల్, లుపిన్.
టైటాన్ కంపెనీకి ‘స్ట్రాంగ్ బై’ రేటింగ్ ను (కొనుగోలు చేయవచ్చంటూ) తొమ్మిది ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు ఇప్పటికే ఇవ్వగా, 16 ఇతర సంస్థలు కూడా కొనుగోలు చేయాలని సూచించాయి. రాకేశ్ ఆయన సతీమణి రేఖలకు టైటాన్ లో 8.06 శాతం వాటా ఉంది. వీటి తాజా విలువ రూ.6,200 కోట్లు. ఎస్కార్ట్స్ లో 9.16 శాతం వాటా ఉంది. వీటి విలువ రూ.870 కోట్లు. ఈ స్టాక్ కు కూడా రెండు స్ట్రాంగ్ బై రేటింగ్స్, నాలుగు బై రేటింగ్స్ ఉన్నాయి. లుపిన్, అరబిందో ఫార్మాల్లో ఒక్కో శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. క్రిసిల్ స్టాక్ కు నాలుగు కొనుగోలు రేటింగ్స్ ఉన్నాయి. తన భార్యతో కలసి రాకేశ్ కు క్రిసిల్ లో 5.58 శాతం వాటా ఉండగా, దీని విలువ రూ.1,880 కోట్లు. డీహెచ్ఎఫ్ఎల్ లో 3.19 శాతం వాటాలుండగా వాటి విలువ రూ.588 కోట్లు.