facebook: ఫేస్బుక్లో ఎక్కువ ప్రస్తావనకు వచ్చిన పార్లమెంటేరియన్లు... మోదీ, సచిన్
- మోస్ట్ పాప్యులర్ కార్యాలయం.. ప్రధాని కార్యాలయం
- మోస్ట్ పాప్యులర్ మంత్రిత్వశాఖ.. విదేశాంగ శాఖ
- లైకులు, షేర్లు, కామెంట్ల విశ్లేషణతో నివేదిక
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నివేదిక ప్రకారం గతేడాది ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన పార్లమెంటేరియన్లుగా ప్రధాని నరేంద్రమోదీ, సచిన్ టెండూల్కర్లు నిలిచారు. ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన లోక్సభ సభ్యునిగా మోదీ, రాజ్యసభ సభ్యునిగా సచిన్ నిలిచినట్లు ఫేస్బుక్ వెల్లడించింది. 2017లో వచ్చిన లైకులు, షేర్లు, కామెంట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. వీరితో పాటు ఆర్కే సిన్హా, అమిత్ షా, అసదుద్దీన్ ఓవైసీ, భాగవత్ మన్ల గురించి ఎక్కువగా ప్రస్తావన వచ్చినట్లు ఫేస్బుక్ పేర్కొంది.
ఇక ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయాలు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన అధికారిక కేంద్రాలుగా నిలిచాయి. మంత్రిత్వ శాఖల్లో విదేశాంగ శాఖ మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్ర నాయకుల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు పాప్యులర్గా ఉన్నారు. రాజకీయ పార్టీల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.