lalu prasad yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కి శిక్ష ఖరారు వాయిదా!
- దాణా కుంభకోణం కేసులో ఇటీవల దోషిగా తేలిన లాలూ
- శిక్షను ఈ రోజు ఖరారు చేస్తామన్న కోర్టు
- రేపటికి వాయిదా వేసిన రాంచీ సీబీఐ కోర్టు
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ రోజు శిక్ష ఖరారు చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను బిర్సా మండా సెంట్రల్ జైలు నుంచి జార్ఖండ్ రాంచీలోని సీబీఐ కోర్టుకు కూడా తీసుకొచ్చారు. అయితే, లాలూతో పాటు మరో 15 మంది శిక్ష ఖరారును రేపు ప్రకటించనున్నట్లు కోర్టు తెలిపింది. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలు ప్రసాద్ యాదవ్‌తో పాటు మరో 15 మందిని గత నెల 23న దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. 1990-94 మధ్య కాలంలో దియోగర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుంచి రూ. 84.5 లక్షల నిధులను పక్కదారి పట్టించిన కేసులో వీరంతా దోషులుగా తేలారు. ఈ కేసులో లాలు ప్రసాద్ యాదవ్‌కి ఏడు సంవత్సరాల శిక్షను విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.