gazal srinivas: గజల్ శ్రీనివాస్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు!
- యువతిని వేధించిన కేసులో జ్యుడీషియల్ కస్టడీలో గజల్ శ్రీనివాస్
- దర్యాప్తు పురోగతి కోసం కస్టడీ కోరిన పోలీసులు
- నాలుగు రోజులు విచారిస్తామని వాదన
ఆలయవాణి రేడియోలో పనిచేస్తోన్న ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో గాయకుడు, రచయిత గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో చంచల్ గూడ జైలులో వున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు రోజుల పాటు గజల్ శ్రీనివాస్‌ని విచారిస్తామని చెప్పారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది.