utharakhand: మదర్సాల్లో మోదీ ఫొటో పెట్టాలంటూ ఆదేశాలు... ససేమిరా అన్న మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్
- ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలు
- తిరస్కరించిన మదరసా ఉపాధ్యాయులు
- ఇస్లాంకు వ్యతిరేకమంటూ ఆగ్రహం
మదరసాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై మదర్సా ఉపాధ్యాయులు మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించారు. మదర్సాలలో వ్యక్తుల ఫొటోలు పెట్టడం ఇస్లాంకు వ్యతిరేకమని... ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మోదీ ఫొటోను పెట్టబోమని అన్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. మదర్సాలకు రాజకీయ రంగు పులమొద్దని రూర్కీకి చెందిన మదర్సా ఉపాధ్యాయుడు ఎహసాన్ సాహెబ్ కోరారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.