south africa tour: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. తొలి టెస్ట్ ఆడనున్న బుమ్రా
- తుది జట్టులో రోహిత్ శర్మ
- ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి
- తొలుత బౌలింగ్ చేయడం ఇబ్బంది కాదన్న కోహ్లీ
కేప్ టౌన్ లో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా సఫారీ కెప్టెన్ డూ ప్లెసిస్ మాట్లాడుతూ, తన అనుభవం ప్రకారం తొలి రోజు పిచ్ స్లోగా ఉంటుందని ఆ తర్వాత క్విక్ గా మారుతుందని చెప్పాడు. టీమ్ సెలక్షన్ కష్టంగానే ఉందని... చివరకు మంచి జట్టునే ఎంపిక చేశామని తెలిపారు. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగుతున్నామని అన్నాడు. పిచ్ కండిషన్ ను బట్టి చూస్తే, తమ జట్టు చాలా బలమైనదని అన్నాడు.
కోహ్లీ మాట్లాడుతూ పిచ్ స్వభావం, పిచ్ మీద పచ్చికను చూస్తుంటే... తొలుత బౌలింగ్ చేయడం పెద్ద కష్టమేమీ అనిపించడం లేదని చెప్పాడు. తాము పాజిటివ్ క్రికెట్ ఆడతామని తెలిపాడు. ముగ్గురు సీమర్లు, పాండ్యా, స్పిన్నర్ అశ్విన్ లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
టీమిండియా జట్టు: ధావన్, మురళీ విజయ్, పుజారా, కోహ్లీ, రోహిత్ శర్మ, సాహా, పాండ్యా, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా.
దక్షిణాఫ్రికా జట్టు: ఎల్గార్, మార్క్ రామ్, హషీమ్ ఆమ్లా, డీ విలియర్స్, డూ ప్లెసిస్, డీ కాక్, ఫిలాండర్, కేశవ్ మహరాజ్, స్టెయిన్, మోర్కెల్, రబాదా.
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా బౌలర్ బుమ్రా టెస్టుల్లో ఆరంగేట్రం చేయనున్నాడు.