rahul gandhi: వీరిద్దరూ కలసి మన దేశాన్ని ఇలా నాశనం చేశారు: రాహుల్ గాంధీ ఫైర్
- 13 ఏళ్ల కనిష్టానికి కొత్త పెట్టుబడులు
- 8 ఏళ్ల కనిష్టానికి ఉద్యోగాల కల్పన
- 8 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యలోటు
భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి ప్రధాని మోదీ జీడీపీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మేథస్సే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ సందర్భంగా జీడీపీకి రాహుల్ గాంధీ కొత్త భాష్యం చెప్పారు. మోదీ దృష్టిలో జీడీపీ అంటే స్థూల ఆర్థిక వృద్ధి కాదని... స్థూల విభజన రాజకీయాలని ఆయన దుయ్యబట్టారు. అరుణ్ జైట్లీ మేథస్సు, మోదీ జీడీపీ కలసి మన దేశానికి ఇచ్చింది ఇవేనంటూ ఆయన ఓ లిస్ట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కొత్త పెట్టుబడులు : 13 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి
బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ : 63 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది
ఉద్యోగాల కల్పన : 8 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది
వ్యవసాయం స్థూల విలువ వృద్ధి : 1.7శాతం పతనమైంది
ద్రవ్యలోటు : 8 ఏళ్ల గరిష్టానికి పెరిగింది
నిలిచి పోయిన ప్రాజెక్టులు : చాలా ఎక్కువ