Bomb Cyclone: అమెరికా, కెనడాలను కప్పేసిన మంచు దుప్పటి.. మైనస్ 50 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!

  • కనుచూపు మేరలో ఎటుచూసినా మంచుదిబ్బలే
  • ఇల్లు వదిలేందుకు భయపడుతున్న ప్రజలు 
  • స్తంభించిన రవాణా వ్యవస్థ 

అమెరికా, కెనడాలు గడ్డకట్టుకుపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోయాయి. ‘బాంబ్’ మంచు తుపాను తర్వాత ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. అమెరికా, కెనడాలు పూర్తిగా మంచుదుప్పటి కప్పేసుకున్నాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి.

గతంలో ఎన్నడూ లేనంతగా కెనడా ఉత్తర ప్రాంతంలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాంబ్ తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి పడిపోవడంతో ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. శనివారం ఒక్కరోజే 2,250 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.

  • Loading...

More Telugu News