Pawan Kalyan: పవన్ కల్యాణ్ గారూ... నా గౌరవం నాశనం కాకుండా కాపాడండి!: పూనం కౌర్ వినతి
- వ్యక్తుల రహస్య అజెండాకు టార్గెట్ గా మారాను
- దయచేసి నన్ను బయట పడేయండి
- పవన్ కు పూనం కౌర్ విజ్ఞప్తి
కొందరి రాజకీయ కారణాలకు, రహస్య ఎజెండాలకు తాను లక్ష్యంగా మారానని నటి పూనం కౌర్ వాపోతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కల్పించుకుని తన గౌరవాన్ని కాపాడాలని వేడుకుంటూ వరుస ట్వీట్లు పెట్టింది.
"గౌరవనీయ పవన్ కల్యాణ్ గారూ. ఈ నా పరిస్థితి నుంచి దయచేసి బయట పడేయండి. ఎందుకంటే, ఇది నా కెరీర్, కుటుంబంతో పాటు ముఖ్యంగా నా గౌరవానికి సంబంధించిన విషయం" అని ఓ ట్వీట్ లో వ్యాఖ్యానించింది. ఆపై "రహస్య అజెండాలతో వస్తున్న వారికి లక్ష్యంగా నేను మారాలని అనుకోవడం లేదు. నేను మిమ్మల్ని కలిసి ఈ విషయంలో మాట్లాడుతాను" అని పవన్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేసింది.
దీంతో పూనంకు మద్దతుగా పవన్ అభిమానుల నుంచి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కొద్దిసేపటి తరువాత పూనం సదరు ట్వీట్లను డిలీట్ చేసింది. అప్పటికే స్క్రీన్ షాట్స్ గా మారిన ఈ ట్వీట్స్ ఇప్పుడు ఇమేజ్ రూపంలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూడవచ్చు.