gazal srinivas: పగలురాత్రీ తేడా లేకుండా గజల్ శ్రీనివాస్ xxx వీడియోస్ చూపిస్తున్నారు.. ఇదేం పధ్ధతి?: మీడియాపై తమ్మారెడ్డి విమర్శ
- పగలురాత్రీ న్యూస్ ప్రసారం చేయొచ్చు
- గజల్ శ్రీనివాస్ వీడియోస్ చూపించవచ్చా?
- నైతిక విలువలతో, బాధ్యతతో మీడియా వ్యవహరించాలి
- దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
డిసెంబర్ 31 అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ గురించి దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘కొత్త సంవత్సరం కొత్త విషయాలు మాట్లాడదామని అనుకున్నాను కానీ, కొత్తవి కనబడటం లేదు. కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా చెప్పుకోవాలి..మంచి జరుగుతుంది అనుకుంటే, మంచి కంటే చెడు ఎక్కువగా జరిగింది.
చెడు అంటే చెడు కాదు..చెడు లాంటిది. గజల్ శ్రీనివాస్ ని పట్టుకున్నారు. సంతోషం. తప్పు చేశాడు.. జైలుకి పంపించేశారు.. బాగుంది. కానీ, అందుకు సంబంధించిన వీడియోలను టీవీల్లో పగలూరాత్రీ అనే తేడా లేకుండా చూపిస్తున్నారు. మామూలుగా ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలను రాత్రి పది గంటల తర్వాత వేయాలని అంటారు. కానీ, గజల్ శ్రీనివాస్ xxx వీడియోస్ చూపిస్తున్నారు. పగలురాత్రీ న్యూస్ ప్రసారం చేయొచ్చు కానీ, ఇలాంటి వీడియోలను ప్రసారం చేయొచ్చా? ఇప్పుడు నేను ఏదన్నా చెబితే .. ‘మీడియాకు చెప్పేంత పెద్ద వాడివి అయిపోయావా? నువ్వు చెప్పినట్టు మీడియా నడవాలా?’ అని అంటారు.
నేను చెప్పినట్టుగా మీడియా నడవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, దాని ఇండిపెండెన్స్ దానికి ఉంది. కానీ, నైతిక విలువలు ఉన్నాయి కదా? మీడియాపై బాధ్యత ఉంది కదా? వాటిని విస్మరించొద్దని చెబుతాం తప్పిస్తే.. మీడియా ఎలా ప్రవర్తించాలన్నది నేను చెప్పట్లేదు. నా ఆలోచన కూడా అది కాదు. నా ఆలోచన ఏంటంటే, ఇలాంటి అసాంఘిక చర్యలు జరిగినప్పుడు వాటిని ఎలా అరికట్టాలో చెప్పడం మీడియా బాధ్యత. అంతేతప్పా, ఆ సంఘటనలను అదేపనిగా ఇలా జరిగిందని చూపెట్టడం సబబు కాదు. అదేపనిగా ఆ సంఘటనలను చూపెట్టడం వల్ల.. ఇలాంటి వాటి గురించి తెలియని వాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.