vikram: రూ. 300 కోట్లతో 'మహావీర్ కర్ణ' .. హీరోగా విక్రమ్!
- కర్ణుడి పాత్ర ప్రధానంగా 'మహావీర్ కర్ణ'
- హిందీతో పాటు దక్షిణాది భాషల్లో
- ఈ అక్టోబర్లో సెట్స్ పైకి
- వచ్చే డిసెంబర్లో విడుదల
'మహాభారతం'లో కర్ణుడు పాత్రకు ఎంతో ప్రత్యేకత వుంది. దాన గుణానికి .. స్నేహ ధర్మానికి ప్రతీకగా ఆయన కనిపిస్తాడు. అర్జునుడితో సమానమైన విలుకాడుగా .. త్యాగనిరతికి నిలువెత్తు నిర్వచనంలా అనిపిస్తాడు. అలాంటి కర్ణుడి పాత్రను కేంద్ర బిందువుగా తీసుకుని, 'మహావీర్ కర్ణ' పేరుతో మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.
హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందుగా కర్ణుడి పాత్ర కోసం పృథ్వీ రాజ్ ను అనుకున్నారు .. ఫస్టులుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ, ఇప్పుడు విక్రమ్ ను ఎంపిక చేసుకున్నారు. యునైటెడ్ ఫిల్మ్ కింగ్ సంస్థ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ అక్టోబర్లో సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు.