e cigarette: ఈ-సిగరెట్లపై నిషేధం విధించిన నితీష్ ప్రభుత్వం

  • తయారీ, అమ్మకం, కొనుగోళ్లపై నిషేధం
  • ఉల్లంఘిస్తే మూడేళ్ల శిక్ష
  • నితీష్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎలక్ట్రానిక్ సిగరెట్ల (ఈ-సిగరెట్లు)పై బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సిగరెట్లపై నితీష్ కుమార్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై ఈ-సిగరెట్ల తయారీ, సరఫరా, ప్రదర్శన, ప్రకటనలు, అమ్మకాలతో పాటు కొనుగోలుపై కూడా నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే మూడేళ్ల శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ ద్వారా ఈ సిగరెట్లు పని చేస్తాయి. ఇందులో ద్రవ రూపంలో ఉన్న నికోటిన్, గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్, నీరు సహా పలు పదార్థాలను ఉపయోగిస్తారు.

  • Loading...

More Telugu News