bhopal: భోపాల్ రైల్వే స్టేషన్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్... దేశంలో మొదటిసారి
- రూ. 5కే ఒక శానిటరీ నాప్కిన్
- 'హ్యాపీ నారి' పేరుతో ప్రారంభం
- ప్రారంభించిన తొమ్మిది గంటల్లోనే 600 నాప్కిన్ల అమ్మకం
దేశంలో మొదటిసారిగా మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్‌ను అందుబాటులో ఉంచిన స్టేషన్‌గా భోపాల్ రైల్వే స్టేషన్ నిలిచింది. ఈ వెండింగ్ మెషీన్ ద్వారా రూ. 5కే శానిటరీ నాప్కిన్ని అందజేయనున్నారు. రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాంలో 'హ్యాపీ నారి' పేరుతో జనవరి 1న రైల్వే విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ భోపాల్ ఈ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది.
ఏర్పాటు చేసిన తొమ్మిది గంటల్లోనే 600 నాప్కిన్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఒక్క మెషీన్లో 75 నాప్కిన్లు ఉంటాయి. శిక్షణ పొందిన మహిళా ఉద్యోగి వీటిలో నాప్కిన్లను నింపుతారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నం గురించి ప్రచారం కల్పించడానికి రైళ్లలో, ప్లాట్‌ఫాంల మీద ప్రచార బోర్డులు కూడా పెట్టినట్లు ఆయన చెప్పారు.