facebook: పెళ్లి కావాల్సిన అమ్మాయిలకు కొత్త కష్టాలు.. ఫేస్బుక్ వ్యసనపరులను వద్దంటున్న అబ్బాయిలు!
- ఇప్పటికే మ్యాట్రిమోనియల్ ప్రకటనల్లో పేర్కొంటున్న వైనం
- సోషల్ మీడియా వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయంటున్న నిపుణులు
- వాటి బారిన పడకుండా ఉండేందుకే ఈ కొత్తరకం ప్రకటనలు
వాట్సాప్, ఫేస్‌బుక్‌లను విపరీతంగా వాడుతున్న అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటారా? ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియాను వ్యసనంగా మార్చుకున్న అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు ఆసక్తి చూపించడం లేదట. ఇప్పటికే ఈ విషయాన్ని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ ప్రకటనలు కూడా వస్తున్నాయట.
పశ్చిమ బెంగాల్‌కి చెందిన అబ్బాయిలు ఈ విషయం గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారట. ఒకవేళ అమ్మాయి ఫేస్బుక్, వాట్సాప్‌లకు అడిక్ట్ అయి ఉంటే.. తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఇది అక్షరాలా నిజం. ఎక్కువగా ఫేస్బుక్, వాట్సాప్ వాడుతుండటం వల్ల భర్తను, పిల్లలను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు వస్తాయని కొన్ని సర్వేల్లో తేలింది. ఇది దృష్టిలో పెట్టుకునే ఇలాంటి ప్రకటనలు పుట్టుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.