Hyderabad: అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఘటన
- పోస్టుమార్టం కోసం మృతదేహం తరలింపు
- యువతికి మతిస్థిమితం సరిగ్గా లేదని చెబుతోన్న తల్లిదండ్రులు
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. స్థానికంగా ఉండే ఓ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్న రేష్మి (18) తాము ఉంటోన్న అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఈ ఘటనకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆ యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, రేష్మికి మతిస్థిమితం సరిగ్గా లేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.