kashmir: భారత ఆర్మీ చీఫ్‌పై మండిపడ్డ కశ్మీర్ ప్రభుత్వం
- ఆ రాష్ట్రంలో విద్యా విధానంపై పునఃసమీక్ష జరపాలన్న ఆర్మీ చీఫ్ రావత్
- రావత్ విద్యావేత్త కాదు
- విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసు- -కశ్మీర్ ప్రభుత్వం
జమ్ము కశ్మీరులో సోషల్ మీడియా, ప్రభుత్వ పాఠశాలలు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బీపీ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పనుల వల్ల యువత తీవ్రవాద ప్రేరేపితులవుతున్నారని, అలాగే మదర్సాలు, మసీదులు కూడా ఇందుకు కారణమవుతున్నాయని చెప్పారు. ఆ రాష్ట్రంలో విద్యా విధానంపై పునఃసమీక్ష జరపాలన్నారు.
అయితే, దీనిపై స్పందించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఆయనపై మండిపడింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇమ్రాన్ రాజా అన్సారీ మాట్లాడుతూ.. రావత్ విద్యావేత్త కాదని, విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తమ ప్రభుత్వానికి బాగా తెలుసని పేర్కొన్నారు. తమకు రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉన్నాయని, తమ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకోగలిగే పరిణతి తమ రాష్ట్ర విద్యార్థుల్లో ఉందని చెప్పారు.