muslims: ముస్లింలకు షాక్.. హజ్ యాత్రలకు ఇకపై సబ్సిడీ లేదు.. సంచలన ప్రకటన చేసిన కేంద్ర మంత్రి

  • మీడియాకు వివరించిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
  • మైనార్టీలను మరింత పటిష్ఠం చేస్తాం
  • ఇకపై హజ్ సబ్సిడీ నిధులను దేశంలో ముస్లిం బాలికల విద్య కోసం వినియోగిస్తాం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది సౌదీలోని మక్కా, మదీనా నగరాల్లో జరిగే పవిత్ర హజ్‌యాత్రకు వెళ్లే భారత ముస్లిం యాత్రికులకు ఇచ్చే సబ్సిడీను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ... మైనార్టీలను మరింత పటిష్ఠం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 1.75 లక్షల మంది ముస్లింలు హజ్‌యాత్రకు వెళ్లనున్నారు. వారంతా సబ్సిడీ లేకుండానే తీర్థయాత్రకు వెళ్లనున్నారు. ఇకపై హజ్ సబ్సిడీ నిధులను దేశంలోని ముస్లిం బాలికల విద్యా, మహిళా సాధికారత కోసం ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. 

  • Loading...

More Telugu News