NTR: ఎన్టీఆర్ చరిత్ర చెప్పాలంటే నేను తప్ప ఎవరూ చెప్పలేరు: లక్ష్మీ పార్వతి
- ఎన్టీఆర్ కు చివరి రోజుల్లో అన్యాయం
- వెన్నుపోటు గురించి బయోపిక్ లో చెప్పాలి
- అందరూ స్వార్థపరులు, భజన పరులే
- నాడు ఎవరూ ప్రశ్నించలేదన్న లక్ష్మీపార్వతి
దివంగత మహా నటుడు ఎన్టీ రామారావు చరిత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాలంటే, తాను తప్ప మరెవరూ చెప్పలేరని ఆయన సతీమణి, వైకాపా మహిళా నేత లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
తాను ఎన్టీఆర్ జీవిత చరిత్రను స్వయంగా ఆయన నోటి నుంచే విన్నానని, ఎన్టీఆర్ కు తన చివరి రోజుల్లో జరిగిన అన్యాయం గురించి చెప్పకుంటే, అది ఎంత బాగా తీసినా మంచి సినిమా అనిపించుకోబోదని, ఆయనకు జరిగిన అన్యాయాన్ని బయోపిక్ లో చూపించాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడుస్తున్నా ఎవరూ ప్రశ్నించలేదని ఆరోపించిన ఆమె, అందరూ స్వార్థపరులు, భజనపరులేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.