akhil: అఖిల్ విషయంలో మనసు మార్చుకున్న నాగ్!
- అఖిల్ 3వ సినిమాపై నాగ్ దృష్టి
- ప్రయోగాలకు దూరంగా ఉండాలనే ఆలోచన
- తన ప్రమేయాన్ని తగ్గించాలనే నిర్ణయం
అఖిల్ రెండవ సినిమా 'హలో' విషయంలో నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఆశించిన స్థాయిలో ఈ సినిమా వసూళ్లను సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ 3వ సినిమాకి సంబంధించిన విషయాలను ఈ నెల 10వ తేదీనే ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఆ ఆలోచనను విరమించుకుని సైలెంటైపోయారు.
అందుకు కారణం నాగ్ మనసు మార్చుకోవడమేననే టాక్ వినిపిస్తోంది. అఖిల్ సినిమా విషయాలను నాగ్ దగ్గరుండి చూసుకుంటూ ఉండటం వలన, దర్శకులకు కాస్త ఇబ్బందిని కలిగిస్తోందట. ఈ విషయం నాగ్ దృష్టికి కూడా వెళ్లడంతో, తన ప్రమేయాన్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చారట. అంతే కాకుండా ఈ సారి ప్రయోగాల జోలికి పోకుండా, యూత్ తో పాటు సామాన్యులకు సైతం కనెక్ట్ అయ్యే కథతో అఖిల్ సెట్స్ పైకి వెళ్లడమే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారట.