jharkhand: బురద మట్టి తింటూ బతికేస్తున్న వందేళ్ల వృద్ధుడు!
- 11 ఏళ్ల వయసు నుంచే అలవాటు
- రోజువారీ ఆహారంగా బురద మట్టి
- జార్ఖండ్‌కి చెందిన కరు పాశ్వాన్
అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటారు... జార్ఖండ్‌కి చెందిన కరు పాశ్వాన్ అనే వృద్ధుడిని చూస్తే నిజమే అనిపిస్తుంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన కారణంగా తినడానికి తిండి లేకపోవడంతో 11 ఏళ్ల వయసులో పాశ్వాన్ బురద మట్టిని తినడం అలవాటు చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు బురద మట్టే ఆయనకు రోజువారీ ఆహారంగా మారిపోయింది. ప్రస్తుతం వందేళ్లకు పైబడి ఉన్న పాశ్వాన్... మట్టిలోని పోషకాలే తన ఆరోగ్య రహస్యమని చెబుతుంటాడు.