aap: 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొన్న విషయంపై హైకోర్టుకు కేజ్రీవాల్ పార్టీ.. అక్కడ కూడా షాక్
- రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవులని చేపట్టారని ఈసీ స్పష్టం
- ఈసీ ముందు సదరు ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్స్‌కు హాజరుకాలేదన్న హైకోర్టు
- ఆప్ వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడి
రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవులని చేపట్టారని తెలుపుతూ 20 మంది ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి నివేదికను పంపిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసును సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల కమిషన్ సదరు 20 మంది ఎమ్మెల్యేలను పిలిచిందని, అయితే ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్స్ కు వెళ్లలేదని హైకోర్టు గుర్తు చేసింది. ఆప్ ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్స్ కు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నిస్తూ.. ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు పేర్కొనడంతో కేజ్రీవాల్ పార్టీ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతోంది.